
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా కండిస్తూన్నామని, ఇలాంటి సంఘటనలు సరికావనీ తెలంగాణ బ్రాహ్మణ సేవ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు విష్ణుదాస్ గోపాల్ రావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… ఆలయ అర్చకులు భగవంతుని శేవలో సమాజ శ్రేయస్సు కోసం నిత్యం తపిస్తూ ప్రజలు అందరు బాగుండాలని అనుకుంటారని అన్నారు. నిత్యం భగవంతుణ్ణి వేడుకునే అర్చకుని పై దాడి ఎంతో నీచమైన చర్యఅని అన్నారు. ఇలాంటి దాడులు జరగడం శోచనియమే కాకుండా దార్మిక సంప్రదాయాలపై జరిగిన దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని అర్చక సమాజానికి హిందూ ధర్మానికి ఆలయ సంప్రదాయాలకు ఆటంకంగా భావిస్తున్నామని అన్నారు . ఈ సమావేశములో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు.రాష్ట్ర అర్చక సంగం అధ్యక్షులు. గంగు ఉపేంద్రశర్మ రాష్ట్ర అధ్యక్షులు. పోచంపల్లి రమణరావు, రాష్ట్ర కన్వీనర్. పవన్ కుమార్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, ఉపాధ్యాక్సులు.kB శర్మ, భాస్కర శర్మ, రాఘవ చార్యులు, ట్రెజరర్ చిట్టంపల్లి ఉపేందర్ రావు, ఇందుర్తి నరేష్ కుమార్, ఐవి రమేష్ కుమార్, శ్రవణ్ విమల్ కుమార్, ఎలాబాక. కృష్ణ, అర్చక సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాహుల్ శర్మ జిల్లా కార్యదర్శి. నందకిశోర్ శర్మ, లలిత్ శర్మ, రామకృష్ణ శర్మ, భగవతుల శ్రీకాంత్ శర్మ. వరంగల్ జిల్లా అధ్యక్షులు. పెండం రాఘవ రావు. కమలాపురం మండల అధ్యక్షులు. విష్ణుదాస్ గిరిదర్ రావు, జిల్లా నాయకులు విష్ణుదాస్ వంశీదర్ రావు, ఇండర్తి జానకి రామయ్య శర్మ, రవీందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
