
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పన్నుల వసూలులో భాగంగా పట్టణంలోని ఓ పాఠశాలకు వెళ్లిన హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య టీచర్ గా మారి పిల్లలకు భవిష్యత్తు పాఠాలు వివరించారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలో ఇంటి పన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది పట్టణంలోని పలువూరు వీధుల్లో తిరిగి ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. సిబ్బంది పనితీరును పనికి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య న్యూ కాకతీయ పాఠశాలలో ఇంటి పన్ను తీసుకుంటుండగా వెళ్లిన ఆయన ఆ పాఠశాలలోని పదవ తరగతి పిల్లలకు భవిష్యత్తు పాఠాలను వివరించారు. తాను కూడా టీచర్‌గా పనిచేసి కష్టపడి గ్రూప్ వన్ పరీక్ష రాయడం ద్వారా కమిషనర్ అయ్యానని మీరు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిల్లలకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ రాజకుమార్, గోపాల్, వెంగల్ రావు, కిషన్ రావు, ప్రతాప రాజు తదితరులు పాల్గొన్నారు.
