
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట పట్టణంలోని ఫిజియోథెరపీ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు తన బృందంతో కలిసి తనిఖీ చేశారు. జమ్మికుంట పట్టణంలో ఓ ఫిజియోథెరపీ సెంటర్ వారు రిజిస్ట్రేషన్ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ డిప్యూటీ డిఎం హెచ్ వో డాక్టర్ చందు ఫిజియోథెరపీ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు. తనిఖీలో భాగంగా డిఆర్ ఏ ఆక్ట్ ప్రకారం ఫిజియోథెరపీ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపడం జరుగుతుందని తెలిపారు. హుజురాబాద్ డివిజన్లోని ప్రైవేట్ హాస్పిటల్ లు రిజిస్ట్రేషన్ లేకుండా ఒకవేళ నడిపిస్తే డిఆర్ ఏ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మహోన్నత పటేల్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







ఆస్పత్రి నిర్వాహకున్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్న డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ చందు..





