Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్(వీణవంక): వీణవంక మండల పరిధిలోని లస్మక్క పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరిక మేరకు సోమవారం సోలార్ సిసి కెమెరాను అందజేశారు. అనంతరం మద్దుల ప్రశాంత్ పటేల్ మాట్లాడుతూ.. నేర పరిశోధన విభాగంలో ప్రముఖ పాత్ర వహించేవి సిసి కెమెరాలనీ, గ్రామ గ్రామాన అనుకోని ప్రమాదాలు, దొంగతనాలు, కొట్లాటలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రమాదాలను ఎప్పటికప్పుడు నివారించేందుకు, దొంగలను పట్టుకునేందుకు, నిఘా నేత్రాలు, ప్రజలకు రక్షణ కవచాలుగా పనిచేస్తూ ప్రముఖ పాత్ర వహిస్తాయని ఉన్నారు. పోలీసులకు నిఘా నేత్రాలు నేర పరిశోధనలో సహకరిస్తాయని, అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం చేయకుతుందన్నారు. సోలార్ సిసి కెమెరా అందజేసిన మద్దుల ప్రశాంత్ పటేల్ కు ఎస్సై ఆవుల తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దుల ప్రశాంత్ పటేల్ తో పాటు అజయ్ తదితరులు పాల్గొన్నారు.






