
— స్పందించిన కలెక్టర్ తహసిల్దార్ కు క్షేత్రస్థాయి విచారణకు ఆదేశం
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (శంకరపట్నం) జూలై14: కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో గతంలో ధోబిగాడ్ ఉన్న స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారని సోమవారం రజక సంఘం నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయి విచారణకు తహసిల్దార్ కు ఆదేశించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడారు.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రజకుల కులవృత్తి కోసం నాటి తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మొలంగూర్ గ్రామంలో ధోబిగాడ్ నిర్మాణం చేసి రజకులకు అండగా నిలిచిందనన్నారు. సర్వే నెంబర్ 782లో కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో నివాసం ఉండే అగ్రకులానికి చెందిన వ్యక్తి ధోబి గాడ్ ను ధ్వంసం చేసి లక్షల రూపాయలకు విక్రయించి రజక కులస్తులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం అట్టి భూమిని గ్రామంలో ఓ వ్యక్తి లక్షల రూపాయలకు కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేస్తున్నాడని లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో రజకుల కులవృత్తి కోసం నిర్మించిన ధోబి గాడ్ ధ్వంసం చేసి రజకుల జీవనోపాధి లేకుండా చేసిన వ్యక్తిపై చట్టపరంగా న్యాయపరంగా క్షేత్రస్థాయి విచారణ చేసి రజక కులస్తులకు తగిన న్యాయం చేయాలని రజక సంఘం నాయకులు, కులస్తుల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి క్షేత్రస్థాయి విచారణ చేయాలని శంకరపట్నం తాసిల్దార్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.






