
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మత్తు పదార్థాలు అమ్మిన వారిపై, సేవించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని
హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని అనుమానిత ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తున్నారని, అమ్ముతున్నారని అనుమానంతో రద్దీ ఉండే ప్రదేశాలలో కరీంనగర్ స్పెషల్ టీంతో అనుమానిత ప్రదేశాలను, బస్టాండ్, కొన్ని సూపర్ మార్కెట్లను అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మానుష ప్రాంతాలలో ఎవరైనా మత్తు పదార్థాలు గంజాయి లాంటి వాటిని సేవిస్తే వారి సమాచారాన్ని పోలీస్ వారికి ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ తనిఖీలలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రాధాకిషన్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

బస్టాండ్ లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు..


షాపింగ్ మాల్ లో డాగ్స్ కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు..


కళాశాల, పాఠశాల ఆవరణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు…

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రాధాకిషన్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది.





