
Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం 44 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగినట్లు హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎన్ నారాయణరెడ్డి లు తెలిపారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోనీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం జరిగింది. ఈ శస్త్ర చికిత్స శిబిరంకు చెల్పూర్ పిహెచ్సి పరిధిలోని హుజురాబాద్ శంకరపట్నం జమ్మికుంట తదితర మండలాల నుండి వచ్చారు. ఈ శిబిరంలో 10 మందికి ట్యూబెక్టమి ఆపరేషన్లు, 34 మందికి వేసెక్టమీ ఆపరేషన్లు జరిగినట్లు వారు తెలిపారు. ఆపరేషన్లను డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ స్వరూపరాణి లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మధుకర్, సిబ్బంది సత్యం ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
