
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (హుస్నాబాద్):పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి పి విశ్వనాథన్ హాజరయ్యారు. అలాగే సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లు సుధాకర్, నిర్మలా జయరాజ్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల వారిగా పట్టభద్రుల ఓట్లు ఎన్ని సాధిస్తారు, ఎలా వారిని ఓటు వేయించాలి తదితర వాటిపై ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఏ ఒక్క ఓటు మిస్ కావద్దు.. అన్ని మన అభ్యర్థికి పడాలని సూచించారు. అందరూ కష్టపడాలి, వాళ్లందరినీ వ్యక్తిగతంగా కలవండి అని పేర్కొన్నారు. ఒక్కొక్క ఎంపీటీసీ వారిగా ఓట్లు చేస్తే 40 వచ్చాయని, పార్లమెంట్ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి మంచి మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో మన నియోజకవర్గం నుండి మంచి మెజారిటీ రావాలన్నారు.
హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. అయిన ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం..పట్టభద్రులు ఎవరెవరు అనేది స్థానికంగా మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి ఓటు మనకు తెచ్చుకోవాలి.. పొరపాటున ఆ ఓటు వేరే పార్టీకి పడితే ఆ గ్రామంలో మనం నష్టపోతాం అని సూచించారు. తెలంగాణలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం..brs అమలు చేసిన పథకాలు కొనసాగిస్తూనే కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మీ అందరి సహకారంతో 92 మంది మాజీ ఎంపీటీసీలకు ఇంచార్జిలుగా నియామకం చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు మధ్యాహ్నం 4 వరకే ఉంటుంది, మన అభ్యర్థి సీరియల్ నెంబర్ 2.. ఆయన పక్కన 1 నెంబర్ వేయాలని మంత్రి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా కష్టపడి పని చేశారో ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అందరూ కష్టపడాలన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవాల్సిందే.. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురాల్సిందే అని మంత్రి సూచించారు. ఈ రెండు రోజులు పట్టభద్రులను నేరుగా కలిసి ఓటు కాంగ్రెస్ కి వేసేలా వారితో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఉద్యోగాల భర్తీ ,317 జీవో సమస్యల పరిష్కారం, ఉద్యోగుల బదిలీలు , ప్రమోషన్లు విద్యా ఉపాధి అవకాశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సూచించారు. 14వ లోక్ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ బ్రాండ్ అని, హౌజ్ లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ఉన్న తెలంగాణ కోసం పోరాడారన్నారు. స్పీకర్ మీరాకుమార్ మీద దాడి జరిగే అవకాశం ఉందని సెక్యూరిటీ ఆఫీసర్ నాకు చెప్పారని, తెలంగాణ బిల్లు సమయంలో మేమంతా వలయం లాగ ఉన్నాం అంటూ గుర్తు చేశారు. నేను చాలా గర్వంగా ప్రకటిస్తున్న ఆరోజు కొంతమంది తెలంగాణ బిల్లు రాకుండా బిల్లు పత్రాలు చింపారు..అయిన బిల్లు పై వెనక్కి తగ్గలేదు అన్నారు. నాది తమిళనాడు రాష్ట్రం అయినప్పటికీ ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కోసం అక్కడే ఉన్నామన్నారు. పొన్నం ప్రభాకర్ టైగర్.. ఫైటర్.. తెలంగాణ కోసం కొట్లాడారు అని విశ్వనాథన్ పేర్కొన్నారు.


