
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం దేవి ఫ్యాషన్స్ డ్రెస్సెస్ ను తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక ప్రారంభించారు. రాంపూర్ గ్రామానికి చెందిన ముషం రాజేందర్ దేవి ఫ్యాషన్ ను నిర్వహిస్తున్నారు. మాజీ చైర్మన్ ను రాజేందర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ముక్క రమేష్, కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తక్కువ ధరలో అన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయని వాటిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రిబ్బన్ కట్ చేసి షాప్ ను ప్రారంభిస్తున్న తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక








