Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వర్గీకరణపై ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అన్ని ఉద్యోగాల్లో వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు సోమవారం 6వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో పాల్గొన్న ఎంఎస్పి జాతీయ ఉపాధ్యక్షుడు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ మాదిగల సూర్యుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ పోరాటం, అమరుల త్యాగఫలం ఫలితంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ఉద్యోగాల్లో వర్గీకరణను అమలు చేస్తానని అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను ఎలాగైతే అమలు చేస్తుందో అదే విధంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాదిగలకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. ఈ దీక్షలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాల మహానాడు రాష్ట్ర నాయకులు సొల్లు బాబు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తునికి సమ్మయ్య, ఎర్ర శ్రీధర్, మహమ్మద్ రఫీ, అందాసి నారాయణ, ఎర్ర రాజ్ కుమార్, బుడగ జంగాల నాయకుడు సిరిపాటి వేణు, మొలుగు శ్రీనివాస్, ఎంఈఫ్ నాయకులు వేల్పుల భాస్కర్, దేవునూరి రవీందర్, కుమ్మరి అనిల్, లంకదాసరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






