
Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి (కరీంనగర్) మెట్ పల్లి/కోరుట్ల, మార్చి22: కోరుట్ల పట్టణంలోని కృష్ణ టెంపుల్ వద్ద అదుపుతప్పి గౌతమ్ హై స్కూల్ కు చెందిన బస్సు ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొనడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను తీసుకురావడానికి పరీక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మారుతీకి స్వల్ప గాయాలు కాగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు వివరాలు సేకరించి ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న సైదాపూర్ మండలంలో స్కూలు బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనదారును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందిన విషయం విధితమే. ఈ సంఘటన మరొక ముందే మళ్లీ మరొక స్కూల్ బస్సు సంఘటన జరగడం ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల నిర్వహణ తీరు పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది.
