Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం హుజురాబాద్ ప్రతినిధి, మే 20: హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన కండే నాగయ్య కుమారుడు ఆటో డ్రైవర్ కండె రాజు (41) ఈ నెల 15న గుండెపోటుతో మరణించగా, ఆయన కుటుంబానికి పోతిరెడ్డిపేట రూట్ ఉమేష్ చంద్ర ఆటో యూనియన్ అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో యూనియన్ తరఫున రూ. 5,000 నగదుతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేసి ఆర్థిక సహాయం అందించారు. తోటి ఆటో కార్మికులు విపత్కర సమయంలో మరణించినట్లయితే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు చిరు సహాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎడ్ల బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు ఎర్ర కుమార్, ఉపాధ్యక్షుడు రాగం శ్యామ్, కోశాధికారి ఎండి అమ్జద్, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, అర్జున్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. కాగా మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ఆటో యూనియన్ నాయకులను పలువురు అభినందించారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్న ఆటో యూనియన్ నాయకులు..





