
–పట్టణంలో వైద్యులు, సిబ్బంది టీబి పై అవగాహన ర్యాలీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వరల్డ్ టిబి డే ను పురస్కరించుకొని సోమవారం డిప్యూటీ డిఎంహెచ్ ఓ కార్యాలయం, ఏరియా హాస్పిటల్ హుజూరాబాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెల్పుర్ వారి ఆధ్వర్యంలో హుజూరాబాద్ ప్రధాన వీధులలో ర్యాలీ మరియు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమము ఆర్ఎంఓ సుధాకర్ రావు మాట్లాడుతూ క్షయ వ్యాది గూర్చి భయ పడవలసిన అవసరం లేదని, సరయిన విధంగా పూర్తి కోర్సు మందులు వాడితే పూర్తిగా నయం అవుతుంది అని అన్నారు. దీని కోసం ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచిత పరీక్ష, ఉచిత మందులతో పాటు పోషకాహార నిమిత్తం మందులు వాడినన్ని నెలలు నెలకు రూ. 1000 అందిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏంఓ Dr సుధాకర్ రావుతో పాటు, చెల్పుర్ వైద్యాధికారి డాక్టర్ మధుకర్, వైద్యులు Dr జరీన, MLHP చెల్పుర్, హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, విజేందర్ రెడ్డి, MPHEO, సమ్మయ్య సూపర్వైజర్ లు మరియు టిబి విభాగం నుండి శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, దేవేందర్ రెడ్డి, నిషాంత్, ఐసిటిసి సుజాత, గీతాంజలి ఎన్జీవోలు పాల్గొన్నారు.

పట్టణంలో ర్యాలీ తీస్తున్న వైద్యులు, సిబ్బంది,


టీవీ నివారణకై ప్రతిజ్ఞ చేస్తున్న వైద్యులు, సిబ్బంది.