Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈనెల 28న హనుమకొండలో జరిగే విశ్వకర్మల సంగం ఆధ్వర్యంలో జరిగే అభినందన సభ కరపత్రాన్ని శనివారం హుజురాబాద్ పట్టణంలో విశ్వకర్మ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…విశ్వకర్మలకు L T 4th కేటగిరీ 10 Hp నుండి 25 Hp వరకు పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, ఎలక్ట్రిసిటీ చైర్మన్ లకు అభినందన సభ కలదని అన్నారు. అభినందన సభకు విశ్వకర్మలు పెద్ద ఎత్తున వచ్చి అభినందన సభ సమావేశంను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర సహయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరు విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్, నందగిరి శ్రీనివాస్, బాణాల వివేకానంద, రాంపల్లి బిక్షపతి, చల్లూరి రఘు, రావుల బిక్షపతి, పంచకోటి సత్యం, సదానందం తదితరులు పాల్గొన్నారు.






