
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ (ఎల్కతుర్తి): బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా హెల్ప్‌లైన్, కమాండ్ కంట్రోల్ సెంటర్
☎️ 9014206465 హెల్ప్‌లైన్ నంబర్.
బీఆర్ఎస్ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సభ వేదిక, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అనుసంధానించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా సహాయం అవసరమైతే 9014206465 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
ట్రాఫిక్ సమస్యలు ఎదురు కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మానిటర్ చేస్తారు. ట్రాఫిక్‌లో ఎవరైనా చిక్కుకున్న సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లేదా హెల్ప్‌లైన్‌కు అందించితే, అక్కడి నుండి తగిన సూచనలు చేస్తారు.

సభా వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు చేసిన దృశ్యం.






