
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ (ఎల్కతుర్తి): భారీ బహిరంగ సభలు జరిపిన చరిత్ర వరంగల్ ది అని, అప్పుడు మహా గర్జన, ఇప్పడు రజతోత్సవ సభకు వరంగల్ వేదికగా నిలిచిందనీ మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం ఎల్కతుర్తి సభ వేదిక వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారనీ, పాదయాత్ర, ఎడ్లబండ్లు, సైకిల్ యాత్రగా, సొంత వాహనాలతో వస్తున్నారన్నారు. కేసీఆర్ ను చూడాలని, ఏ మాట్లాడుతరో స్పీచ్ వినాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారనీ చెప్పారు.
ఇది రజతోత్సవమే కాదు, నిజంగా పండుగే అని బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణే లేదు, అభివృద్ధే కాకపోవు అని అన్నారు.
సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలు, వలసలు, ఆత్మహత్యలకు తెలంగాణ నిలయంగా ఉంటుండేదని, ఈ ప్రాంతానికి విముక్తి కలిగించిన, ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన చెప్పారు. నాడు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపింది, ప్రతిపక్షంలో ఉంటూ కాంగ్రెస్ మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్సే అని అన్నారు.
ప్రజలు ఏ అవకాశం ఇచ్చినా వారి కోసమే పనిచేసినం అని,
ఏ కష్టం వచ్చిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నరనీ చెప్పారు. కేసీఆర్ రావాలని కాంక్షిస్తున్నరనీ, ఏడాదిలో పాలు ఏవో..? నీళ్లేవో తేలిపోయినయ్ అని అన్నారు. ఒక్క పథకాన్ని అమలు చేయలేదని, గతంలో ఉన్న పథకాలకు కోత పెట్టిన్రు అని ఆరోపించారు. ఏడాదిన్నరగా ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూపాయి కూడా నిధులివ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ కిట్టు, రైతుబంధు బంధైనయ్, బతుకమ్మ చీరలు లేవు, కల్యాణ లక్ష్మి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వచ్చే పరిస్థితి లేదు అన్నారు. తులం బంగారం దేవుడెరుగు, శ్రుతి లేని, గతి లేని ప్రభుత్వం తయారైందన్నారు. మంత్రులు తలో మాట మాట్లాడుతున్నరనీ, ఏటా 12 శాతం రాష్ట్ర ఆదాయం పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సంపద పెంచి, పేదలకు పంచిందనీ గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం మైనస్‌లోకి వెళ్లిందనీ, జీఎస్టీ తగ్గిందని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయిందనీ ఆరోపించారు. ప్రభుత్వ చేతగాని తనంతో అన్ని ఆదాయాలు తగ్గాయన్నారు.
రేవంత్ రెడ్డి మాటల మనిషిగా నిలిచారనీ, దేవుళ్ల మీద ఒట్లు పెట్టి దేవుళ్లను, రైతు బంధు వేస్తానని అసెంబ్లీలో చెప్పి శాసనసభను మోసం చేశారన్నారు. అందుకే రైతులు ఇవ్వాళ కేసీఆర్ వైపు చూస్తున్నరనీ, రైతు రాజ్యం బీఆర్ఎస్ తోనే సాధ్యమైందన్నారు. ప్రపంచంలో నగదు బదిలీ చేసిన రాష్ట్రం ఏదీ లేదనీ, పీఎం కిసాన్, అనేక రాష్ట్రాల్లో రైతుబంధు రావడానికి చాంపియన్ బీఆర్ఎస్సే అని పేర్కొన్నారు. నీటి తీరువా లేని, కరెంటు బిల్లు లేని రాష్ట్రం తెలంగాణ అని, రైతులకు అద్భుతమైన పాలన అందించిందన్నారు. ఏ ఊరిలో బండ్లు సరిపోతలేవు, బస్సులే కాక లారీల్లో రావడానికి రైతులు ఉత్సాహంగా ఉన్నరనీ తెలిపారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత రుణమాఫీ కాలే, సాగునీరు రాలే, నీళ్లు లేక కాదు, పాలన చేతకాక అని హరీష్ రావు పేర్కొన్నారు. దేవాదుల మోటర్లు 45 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనయనీ లక్షల ఎకరాలు ఎండినయ్ అన్నారు. సమ్మక్క సారక్క కట్టినం, మోటర్లు ఉన్నయి, మెయింటనెన్స్ ఇవ్వక వరంగల్‌లో 700 కోట్ల పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు.
కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం 34 శాతం వాటా ఉందనీ, 25 శాతం వాడుకోని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ నీళ్లుండి పంటలు ఎండబెట్టిందన్నారు. శ్రీశైలం, సాగర్‌లో నీళ్లున్నా కాంగ్రెస్ చేతగాని తనంతో సకాలంలో మోటార్లు ఆన్ చేయక పంటలు ఎండబెట్టిందన్నారు. నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, కల్వకుర్తిలో నీళ్లున్నా వాడుకోలేని దుస్థితి ఉందన్నారు.
రైతుబంధు, రైతుభీమా, పెండింగ్ ప్రాజెక్టులు కట్టి ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ ముందుదనీ గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో రైతులు అంచనాలను మించి వస్తరు అని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రసంగం వినాలని కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నరనీ చమత్కరించారు.
మీరు ఎన్ని టెన్షన్లు పడ్డా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను ఏకం చేసి స్వచ్ఛందంగా తరలిరావాలనీ, కావాలని ప్రభుత్వం, పోలీసులు ట్రాఫిక్ జామ్ చేయాలని చూస్తరు అని, వలంటీర్లు స్వీయ క్రమశిక్షణ పాటించాలనీ, కార్యకర్తలే పోలీసులు, వలంటీర్లుగా సేవలందించాలనీ హరీష్ రావు సూచించారు. తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమైతుందని జయశంకర్ సార్ నమ్మి కేసీఆర్ వెంట ఉన్నారన్నారు. వరంగల్ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు సహకరించాలనీ, ఇది బీఆర్ఎస్ సభ కాదు. ప్రజల సభ, ప్రజల కష్టాలను తీర్చే సభ అని, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, ప్రజల ఆలోచనల నుండి పుట్టిందన్నారు. జనం రారనే ది లేదు,
కార్యకర్తలు ఓపికతో పని చేయాలనీ, అందరూ సభా స్థలికి చేరుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వం, పోలీసులు కుట్రకు చేసే అవకాశం ఉందనీ, గతంలో బీఆర్ఎస్ సభ సందర్భంలో వాపస్ పోవాలని పోలీసులు తప్పుడు సమాచారం చెప్పిండ్లు అని,
సభ వద్ద జాగ లేదని, బండ్లు మలిపే కుట్ర చేసిండ్లు, తప్పుడు సమాచారం ఇచ్చిండ్లు అనే గుర్తు చేశారు. ఇప్పుడు అలా కాకుండా కార్యకర్తలు స్వీయ నియంత్రణతో పని చేయాలనీ.. వర్షం వచ్చినా సభను విజయవంతం చేయాలనీ హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, పక్కన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ నాయకులు..





