
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మరియు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.













