Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ (ఎల్కతుర్తి): తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ ఆధ్వర్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ అని నిజమైన రైతు రాజ్యం అంటే బీఆర్ఎస్ పార్టీ అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. ఆదివారం నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ 25 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పోలాడి రామారావు పాల్గొని మాట్లాడారు.
టీఆర్ ఎస్ పేరుతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్, సకల జనుల తో కలిసి అప్రతిహతంగా కొనసాగించిన పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించి పదేళ్లు అధికారం లో ఉండి అనేక అభివృద్ది కార్యక్రమాల చేపట్టి దేశ జీడీపీ లో ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో తమ ప్రజా సంఘాల సమాఖ్య తరపున రైతాంగానికి పంట పెట్టుబడి, రైతులకు భీమా సౌకర్యం కల్పించాలని కేసీఆర్ కు తాము చేసిన విన్నపం మేరకు తక్షణం స్పందించిన కేసీఆర్ ఉన్నతాధికారుల తో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి రైతు బందు, రైతు భీమా సౌకర్యం కల్పించారని కేసీఆర్ ను రామారావు ప్రశంసించారు.
దేశంలోనే తొలిసారిగా నగదు బదలీ పధకం అమలు చేసింది కేసీఆర్ అని దీని స్ఫూర్తి తోనే పీ ఎం కిసాన్ యోజన, తో పాటు అనేక పథకాలు అమలు అయ్యాయని రామారావు పేర్కొన్నారు.
చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల క్రింద ఉచిత సాగు నీరు అందించి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేకూర్చిందని పొలాడి కొనియాడారు.
ధాన్యం ఉత్పత్తి లో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వం లో 14 ఏళ్లు ఉద్యమాన్ని నడిపి, పదేళ్లు అధికారం లో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి దేశ జీడీపీ లో ముఖ్య పాత్ర పోషించిందని, ఏడాదిన్నరగా ప్రతిపక్షంగా బీ ఆర్ ఎస్ పార్టీ సమర్థవంతంగా పనిచేస్తుంది అని అన్నారు. ఎన్నో ఉద్యమ సంస్థలు రాష్ట్రంలో, దేశంలో పుట్టినప్పటికీ అవి కనుమరు గయ్యాయి కానీ 25 ఏండ్లు సమర్థవంతంగా టీఆర్ఎస్ పార్టీ, 43 ఏళ్లు టీడీపీ పార్టీ మాత్రమే నిలదొక్కుకున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని తెలంగాణ రాష్ట్రం లేకుంటే అభివృద్ది సాధ్యం అయ్యేది కాదని పోలాడి రామారావు అన్నారు.
బ్రహ్మాండ మైన తెలివి తేటలు ఉన్న కేసీఆర్ భారత దేశంలో ప్రాంతీయ పార్టీల స్థితి గతుల గురించి వాటి ఎత్తు పల్లాల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసని మరీ ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ లో అనేక సంవత్సరాల పాటు క్రియాశీలక పాత్ర పోషించిన కేసీఆర్ టీడీపీకి సంబంధించిన సిద్ధాంతాలు విధి విధానాలు ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదన్నారు. వైఫల్యాలు ఎదురైన ప్రతి సందర్భంలో ఎలా విజయంగా మలచుకోవచ్చో టీడీపిని చూసి కేసీఆర్ సమీక్షించుకోవాలని బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయ పడుతున్నట్లు రామారావు అన్నారు
చీటికీ మాటికి బీజేపీతో కానీ టీడీపీపై కానీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అసందర్భ ప్రేలాపనలు మానుకోవాలని హుందాగా వ్యవహరించాలని మేధావులు, రైతు ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి రావడం, పాద యాత్రలు, ఎడ్లబండి, సైకిళ్ళు, ద్విచక్ర వాహనాల ద్వారా తరలి రావడంపై రాష్ట్ర రాజకీయాలలో చర్చోపర్చలు జరుగుతున్నాయని
తాము సైతం తమ రైతు ప్రజాసంఘాల తరపున స్వచ్ఛందంగా సభకు హాజరవుతున్నట్లు పొలాడి రామారావు తెలిపారు.






