
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన బత్తుల మానసను హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్లో గురువారం ప్రజాసంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిరుపేద కుటుంబానికి చెందిన మానస తన లక్ష్యసాధన కోసం శ్రమించి కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చందుపట్ల జనార్ధన్, సొల్లు బాబు, సందేల వెంకన్న, బత్తుల మనోజ్, బత్తుల ఉమాదేవి, అర్జున్ , రాజేందర్ రాజయ్య గోస్కుల మధుకర్, ప్రవీణ్, కనకయ్య, రాజయ్య, సబ్బని రాజేందర్, కామెర లక్ష్మణ్, ఆకునూరి అచ్యుత్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


మానసకు సన్మానం చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు