
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:ప్రపంచ కార్మికుల 139వ ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం హుజురాబాద్ లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కార్మిక సంఘాల నాయకులు అరుణ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్మికులు, హమాలీలు, గ్రామపంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు మే డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయ సమీపంలో, పోస్ట్ ఆఫీస్ ఆవరణలో, ఎల్ఐసి కార్యాలయంలో, ఆటో స్టాండ్ వద్ద, బస్టాండ్ వద్ద, బస్ డిపోలో, వివిధ మిల్లుల వద్ద, ఆటో స్టాండ్ ల వద్ద, ఏరియా ఆసుపత్రి వద్ద కార్మిక సంఘాల నాయకులు అరుణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన దృష్టి పెట్టాలని పలువురు కార్మిక సంఘాల నాయకులు కోరారు. కార్మికుల ఐక్యంగా ఉంటే కార్మికుల సమస్యలు తీరడం సులభం అవుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని ఈనెల 7 నుండి సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొప్పుల శంకర్, ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు టీఎస్ సింగ్, జి శ్రీనివాస్ జి శ్రీనివాస్, సాదుల కిషోర్, వేల్పుల ప్రభాకర్, రమేష్ కుడికాల అశోక్ బాబు, వి రాములు, సిహెచ్ రమేష్, తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు యు మహేందర్, జక్కు రజినీకాంత్, గోపి, కిషన్, తిరుపతి, హరీష్, వేణు, ఎండి అజ్జు, సులోచన, సరోజన, రౌతు సుధాకర్, అనిల్, పాల్గొన్నారు.

ఎల్ఐసి కార్యాలయం వద్ద జెండా ఎగరేస్తూ…

ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు జెండా ఎగరవేసిన నినాదాలు చేస్తూ..

పోస్ట్ ఆఫీస్ వద్ద జెండా ఎగరవేస్తూ…

మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు జెండా ఎగరేస్తూ..