Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ విద్యా సంవత్సరము..ఫీజుల నియంత్రణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ అనుమతులు, కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలకు చర్యలు చేపట్టాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్రె శ్రీధర్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాల దందాను ప్రారంభించాయని అయినా కూడా విద్యాశాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు అన్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని.. జీవో నెంబర్ 42 ప్రకారం ప్రభుత్వ నిబంధన ప్రకారం అర్బన్ లో, రూరల్ లో ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారమే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఫీజులు తీసుకోవాలని, పెంచుకోవలసి వస్తే కలెక్టర్ మరియు డిఇఓ.. మరియు పేరెంట్స్ కమిటీ నిర్ణయ అధికారం మేరకు మాత్రమే ఫీజులు పెంచుకోవడానికి “జీవో” నెంబర్ 42 సూచిస్తుందని చెప్పారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు అర్హత ఉందని దీన్ని ప్రతి సంవత్సరం తుంగలో తొక్కి పది నుండి 20% వరకు ఇష్టానుసారం ఫీజులు పెంచుకోవడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా మారుతుందని అన్నారు. దీనిపై ఈ విద్యా సంవత్సరం దృష్టి సారించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని దాంతోపాటు…జిల్లా కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేని, స్కూల్ గ్రౌండ్, విశాలమైన తరగతి గదులు, వెంటిలేషన్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు సైన్స్ ల్యాబ్లు గ్రంధాలయాలు , అర్హత గల టీచర్స్, ఇట్లాంటి అంశాలలో విద్యా సంవత్సరం మానిటరింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు జీవో నెంబర్ 1,10,92,42 .. ప్రభుత్వ జీవోలను పగడ్బందీగా అమలు చేసి…డీజీ, ఒలంపియాడ్, ఈటెక్నో, ప్రభుత్వ అనుమతి లేని తోక పేర్లను తొలగించాలన్నారు. ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేసి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐఐటి, నీట్ తప్పుడు ర్యాంకులతో ప్రచారం చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అనుమతులేని కనీస మౌలిక సదుపాయాలు లేని పాఠశాలల ముందు ప్రత్యక్షంగా ధర్నాలకు దిగుతామని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.






