
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇండియాపై అడుగడుగునా ఉగ్రవాదులను ఉసి గొలుపుతున్న పాకిస్థాన్ ను మట్టు పెట్టకపోతే వికసిత్ భారత్ లక్ష్యంగా దూసుకెళ్ళే ఇండియాకు వికాసం ఉండదని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అభిప్రాయ పడ్డారు.
రెండు సార్లు పాకిస్థాన్ ను మట్టు పెట్టే అవకాశం మనకు వచ్చినా అగ్ర రాజ్యం శాంతి సయోధ్య హిత వచనాలతో అప్పటి మన కేంద్ర ప్రభుత్వ పాలకులు ఘోరమైన తప్పిదం చేశారని మేధావులు మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఉగ్రమూకల అంతమే లక్ష్యంగా పాకిస్థాన్ తో చేస్తున్న ధర్మ పోరాటంలో కూడా పాకిస్థాన్ ను మట్టు పెట్టే అవకాశాలు కనబడుతున్నా మళ్లీ అగ్రరాజ్య అమెరికా హిత వచనాలతో భారత్ వెనకడుగు వేయడాన్ని మెజారిటీ దేశ ప్రజలు హర్శించలేక పోతున్నారని పోలాడి రామారావు అన్నారు. పాకిస్థాన్ దుష్ట కుయుక్తులతో మళ్లీ మనం మోసపోకుండా పాక్ ఆక్రమించుకున్న ఆక్రమిత కాశ్మీర్ ను తక్షణం తిరిగి స్వాధీనం చేసుకుని పాకిస్థాన్ కు మనదేశం తగిన గుణపాఠం చెబుతేనే సీమాంతర ఉగ్రవాదానికి తెర పడుతుందని ఆదివారం మీడియా తో పోలాడి రామారావు అన్నారు. 1965లో ఎంతోమంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినా దయిర్యంతో మన సైన్యం ముందుకు వెళ్ళి లాహోర్ కు చేరుకొని మట్టుపెట్టే అవకాశం వచ్చినా అప్పటి ప్రధాని ఆదేశాలతో వెనక్కి తగ్గామని,
1971 లోపాకిస్థాన్ తో రెండోసారి 19 రోజులు మన సైనికులు యుద్ధం చేసి 99 వేల మంది పాకిస్తాన్ సైన్యాన్ని మన గ్వాలియర్ వద్ద సైనికులు బంధించి తీసుకు రాగా 3 నెలల తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తిరిగి పంపించి పాకిస్తాన్ ను మట్టు పెట్టే అవకాశం చెజార్చు కోవాల్సి రావడం మన భారత్ దురదృష్టకరమని అప్పుడు మట్టు బెడితే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కావని మాజీ సైనికులు వాపోతున్నారని అన్నారు. ఇండియా శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అభివృద్ధిలో దూసుకు పోవడం, బలంగా ఎదగడం ఇష్టం లేని కొన్ని దేశాలు పాకిస్థాన్ ను పావుగా వాడుకొని మన పై ఉసిగొలుపుతున్నారన్నారు. పాక్ చేసే ఉగ్రవాదంపై నామ మాత్రంగా స్పందిస్తున్నారని ఇక ఎంత మాత్రం ఉపేక్షించ వద్దని రామారావు హెచ్చరించారు. 1971లో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో మన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇండియా పాకిస్థాన్ వ్యవహారాల్లో తల దూర్చితే అమెరికా నోరు మూసుకొని కోర్చిదని ఇండియాకు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పగా అందుకు స్పందించిన ఇందిరాగాంధీ ఇండియా అమెరికాను స్నేహితునిగా పరిగణిస్తోందని యజమానిగా కాదని తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉందని పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కు ఇందిరా ఘాటుగా జవాబు చెప్పి భారత అమెరికా సంయుక్త పత్రికా సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసి వైట్ హౌస్ నుంచి దర్జాగా ఠీవిగా బయటకు వచ్చి అభివృద్ది చెందుతున్న దేశంగా ఆకృత్యాలపై పోరాడి దృఢంగా నిటారుగా ఉండే మా శక్తి ఏందో భవిష్యత్ లో ఋజువు చేస్తామని అమెరికా అధికారులతో అనడం అప్పట్లో సంచలనం అయ్యిందని విశ్లేషకులు అంటున్నారన్నారు. ఇండియాకు చేరుకున్న తర్వాత నాటి ప్రతిపక్ష నేత వాజపేయితో ఇందిరాగాంధీ మాట్లాడి ఐక్యరాజ్యసమితి సమావేశానికి వాజపేయిని పంపి మన దేశ గళాన్ని వాజపేయి ద్వారా గలంగా వినిపించడంతో కన్నెర్ర చేసిన అమెరికా పాకిస్తాన్ ను చేరదీసి ఆర్థిక సైనిక సహాయం చేసే భారత దేశానికి అమెరికా కంపెనీల వచ్చే చమురు సరఫరాను నిలిపివేసి ఇబ్బందులకు గురి చేసినా ఇండియా వెనకడుగు వేయకుండా ఉక్రెయిన్ నుంచి చమురు సరఫరాలను జరిపించుకుందనీ గుర్తు చేశారు. ఆ తర్వాత ఇండియా సొంత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ గా రూపు దిద్దుకొని ఒక బలమైన దేశంగా ఇండియా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు
ఇండియా దెబ్బకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ ను కోల్పోయిందని
అప్పటి నుంచి మన దేశంపై పొరుగు దేశాలు విద్వేష భావంతో మనకు పక్కలో బల్లెం గా తయారై నేటికీ విషం చిమ్ముతున్నాయని
అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాకిస్థాన్ కు గట్టి బుద్ది చెప్పాలని పోలాడి డిమాండ్ చేశారు. ఇప్పుడు అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ చేసి మళ్లీ పాకిస్థాన్ మనపై దొంగ చాటుగా దెబ్బ కొట్టే కుయుక్తులు పన్నుతూనే ఉంటుందని అన్నారు. పాకిస్థాన్ లో పాలన లేదని ఉగ్రవాదులతో కలిసి సైనిక నియంత పాలన ఉందని జవాబుదారి తనం లేదని అమెరికా, చైనా వాళ్ళ మాటలు నమ్మకుండా పాకిస్థాన్ ను మట్టు పెట్టి మన సత్తా ప్రపంచానికి చాటాలని అప్పుడే భారత్ కు దివ్య భవిష్యత్ ఉంటుందని యావత్ దేశ పౌరులు కోరుతున్నారని పోలాడి రామారావు వెల్లడించారు.
