
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: “ఆపరేషన్ సింధూర్”లో పోరాడుతున్న మన భారత ప్రభుత్వ త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్)కు మద్దతుగా భారతదేశ ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న ఈ తరుణంలో శ్రీ కేసరి హనుమాన్ స్వామి వారి శక్తి (భగవదనుగ్రహo)కూడా భారత సైన్యానికి అత్యంత ఆవశ్యకం కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo, దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజుకరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోనీ శ్రీ హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సింధూర ఆకు పూజలు నిర్వహించడo జరిగింది. ఇది కేవలం యుద్ధం కాదు – ఇది ధర్మం కోసం, దేశ గౌరవం కోసం పోరాటం. మన ఐక్యత, మన దేశభక్తి ప్రపంచానికి తెలియజేయాలన్నారు. పాకిస్తాన్కు భారత దేశం ఏంటో స్పష్టంగా చెప్పే సమయం వచ్చేసిందనీ, భారత్ ఏకమైతే ఎంత శక్తివంతమైందో చూపే సమయం ఇది అన్నారు. అందుకే మన సైనికులకు శ్రీ హనుమాన్ స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి, మరింత శక్తి యుక్తులను వారికి ప్రసాదించి ఉగ్రమూకలను తుదముట్టించి, భారత దేశం విజయ పతాకనికి దూసుకెళ్లాలని భగవంతుడిని వేడుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహణ అధికారి సుధాకర్ మరియు అవధానుల భాస్కర్ శర్మ అర్చకులు, ఆలయ చైర్మన్ కొలిపాక శంకర్ అండ్ ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, హనుమాన్ దీక్ష పరులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చకులు అవధానుల భాస్కర్ శర్మ,