
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి తెర దించాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ తిరిగి స్వాదీనం చేసుకోవడమే మార్గమని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సూచించారు. పాకిస్థాన్ తో జరుగుతున్న యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు వాడైన ఇండియన్ ఆర్మీ జవాన్ మురలీ నాయక్ సంతాప సభలో పోలాడి రామారావు మాట్లాడారు.
ప్రపంచ దేశాలన్నీ మనకు సంఘీభావం తెలుపుతున్న తరుణంలో, ఉగ్రవాదం పూర్తిగా ధ్వంసం కావాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ మిలటరీ మద్దతుతో నడుపుతున్న వందలాది ఉగ్రమూకల శిబిరాలను పూర్తిగా మట్టుబెట్టి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మనం స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందడుగు వేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. దాయాది పాకిస్థాన్ భారత సైన్యంతో పోరాడకుండా సరిహద్దున ఉన్న గ్రామాల పౌరులపై కాల్పులు జరిపి భారత్ పై ఫేక్ ప్రచారం చేసి దృష్టి మరల్చే కుయుక్తులు పన్ని ఆక్రమిత కాశ్మీర్ చే జారకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఉగ్రమూకల మృతదేహాలకు అధికార లాంఛనాలతో పాక్ సైన్యాధ్యక్షుడి పర్యవేక్షణలో జరగడంతో ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా పాకిస్థాన్ని కట్టడి చేయాలని, దీంతో పక్కనే ఉన్న పొరుగు దేశాలకు తగిన సంకేతాలు వెళుతాయని ఈ అవకాశాన్ని చేజార్చు కోవద్దని రామారావు హితవు పలికారు.
పాకిస్థాన్ కు విధిలేని దిక్కుతోచని పరిస్థితుల్లో మధ్యవర్తుల ద్వారా రాయబారంతో కాళ్ళ బేరానికి పాక్ రావడంతో భారత ప్రభుత్వం
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భారత్ అంగీకరించినా, తదుపరి చర్చల్లో ముందుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆధారంగా చర్చలు జరిపి పాక్ లో ఉన్న ఉగ్రమూకలను పూర్తిగా నిర్మూలించే పూర్తి బాధ్యత పాకిస్థాన్ తీసుకునే విధంగా చేసి భారత పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాలన్నారు. నేటి భవిష్యత్ ఉగ్రవాదుల చర్యలకు పాక్ పూర్తి బాధ్యతగా అంగీకరించాలని, ఇది ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలో మాత్రమే జరగాలని అన్నారు. లేకుంటే అంది వచ్చిన అవకాశం చేజార్చుకొని మరోసారి భారత్ మోసపోయే అవకాశం ఉందని పాక్ కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలాడి హెచ్చరించారు. పక్కలొ బల్లెమ్ లా ఉన్నపొరుగు దేశాలైన పాక్, చైనాల వల్ల దేశ రక్షణకు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇప్పటికే దేశం చాలా నష్టపోయిందని, దేశ రక్షణకు వీరోచితంగా పోరాడి అమరులైన వీర సైనికులకు నివాళులు అర్పిస్తూ, సెల్యూట్ చేస్తున్నట్లు పోలాడి రామారావు తెలిపారు.
