
– ఐఐటిలో సీటు సాధించే దిశగా రెహమాన్, సాయి వివేకానందల ప్రయత్నాలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మే 11 : హుజురాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆదివారం వెల్లడైన టీఎస్ ఎప్‌సెట్ 2025 ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారు. పట్టణానికి చెందిన మహ్మద్ రిఫాహ్ ఉర్ రెహమాన్ 309 ర్యాంకు , మంచికట్ల సాయి వివేకానంద 777 ర్యాంకు సాధించారు. రెహమాన్ ఈ ఏడాది జరిగిన జేఈఈ మెయిన్స్ లో 99.58 పర్సెంటైల్ సాధించగా సాయి వివేకానంద జేఈఈ మెయిన్స్ లో 99.41 పర్సెంటైల్ సాధించారు. రెహమాన్, సాయి వివేకానందలు జేఈఈ అడ్వాన్స్‌లో భాగంగా ఐఐటి లో సీటు సాధించేందుకు కృషి చేస్తున్నారు. టీఎస్ ఎప్‌సెట్, జేఈఈ మెయిన్స్ లో మంచి ప్రతిభ కనబర్చిన వీరిని విద్యావేత్తలు, వ్యాపారులు, ప్రముఖులు అభినందిస్తున్నారు.
రెహమాన్ కుటుంబ నేపథ్యం
రెహమాన్ తండ్రి లాల్ మహమ్మద్ స్థానికంగా పూర్వ హాకీ క్రీడాకారుడిగా ఉన్నాడు. అలాగే హనుమకొండలో ప్రయివేట్ అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. తల్లి సాజిదా బేగం భూపాలపల్లి మండలం రాంపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. రహమాన్ తాత రాజ్ మహమ్మద్ హుజురాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు. బాబాయ్ ఉస్మాన్ పాషా కూడా ఉపాధ్యాయునిగా పనిచేసారు. రెహమాన్ పదోతరగతి వరకు వరంగల్ కేంద్రీయ విద్యాలయంలో, ఇంటర్మీడియట్ రెజోనెన్స్ కళాశాలలో చదివాడు.
సాయి వివేకానంద నేపథ్యం ఇది..
సాయి వివేకానంద తండ్రి మంచికట్ల రవీందర్ స్థానికంగా వ్యాపారవేత్తగా ఉండగా, తల్లి అరుణదేవి హనుమకొండ ఎస్వీఎస్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. సాయి వివేకానంద ప్రాథమిక ఉన్నత విద్యను హనుమకొండ సాకేత హైస్కూల్ లో ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కళాశాలలో చదివాడు.
రిఫాహ్ ఉర్ రెహమాన్, సాయి వివేకానందలకు అభినందనల వెల్లువ
ఎప్‌సెట్ తో పాటు జేఈఈ మెయిన్స్ లో మంచి ప్రతిభ కనబర్చిన హుజురాబాద్ పట్టణానికి చెందిన రిఫాహ్ ఉర్ రెహమాన్, మంచికట్ల సాయి వివేకానంద లను తహసీల్దార్ పోతిరెడ్డి రవీందర్, పీఆర్టీయూ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావులకార్ వెంకటేష్, బీజేపీ సీనియర్ నేత గంగిశెట్టి రాజు, ఇన్ఫార్ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ గంగిశెట్టి రాఘవేందర్, ఫ్రాంక్లిక్ ఐటి మేనేజర్ భూపతి శ్రీనివాస్, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత గంగిశెట్టి రఘు, న్యాయవాది కేతిరి శ్రీనివాస్ రెడ్డి, ఎస్బిఐ సైదాపూర్ బ్రాంచ్ మేనేజర్ లింగాపురం చంద్రశేఖర్, మిడ్ మానేరు డీఈఈ బండారు సత్యనారాయణ, ఎస్సారార్ డిగ్రీ కళాశాల లెక్చరర్ రాజేంద్రం, ఎన్నారైలు నాగమల్ల శ్రీనివాస్, పసుల రమేష్, కుడికాల పుండరీకం, కందుకూరి రమేష్ బాబు, నసీర్, వేద పండితులు అనుముల ప్రవీణ్ శర్మ, ఉపాధ్యాయులు గోగుల కరంవీర్, బొమ్మకంటి మురళీధర్, రమణారెడ్డి, రఘురాములు, పొన్నోజు సంతోష్ కుమార్, గోలి సురేష్, దేవోజుల శ్రీనివాస్, అక్కినపల్లి అనిల్, కటకం రాజు, నాగుల వెంకట రమణ, సముద్రాల వేణుగోపాల్, మంచికట్ల రవి, సబ్బని వేణుగోపాల్, బిఆర్ఎస్ నేత రావుల రాజలింగారెడ్డి, ప్రొద్దుటూరు స్వామిరెడ్డి, దల్జీత్ సింగ్, గూడూరి కాంతారెడ్డి, దూలం కిరణ్, లెంకలపల్లి కుమారస్వామి, మల్లారెడ్డి, నల్ల సదయ్య, నార్ల శ్రీనివాస్, నెర్సు జగన్ మోహన్, నరహరి తిరుపతిరెడ్డి, అంగరిక రాజేంద్రప్రసాద్, ప్రతాప శ్రీనివాస్, స్పోర్ట్స్‌మెన్ గట్టు శ్రీధర్, నసీరోద్దిన్, కొమురవెల్లి శ్రీనివాస్, పెందోట కృష్ణమోహన్ తదితరులు అభినందించారు.
మంచికట్ల సాయి వివేకానంద


రిఫాహ్ ఉర్ రెహమాన్





