
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి దిష్టిబొమ్మను ఈరోజు హుజురాబాద్ బిజెపి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసిన ఉద్యమ బిడ్డ ఈటెల రాజేందర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, పేదల కొరకు కొట్లాడే వాడు ఈటల రాజేందర్ అన్నారు. అలాంటి నాయకునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ గుండాల్లారా ఖబర్దార్ అని హెచ్చరించారు. బహిరంగంగా ఈటల రాజేందర్ కి జగ్గారెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలనీ లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ, రాస్తారోకోలు చేస్తామని హుజురాబాద్ బిజెపి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నల్ల సుమన్, రావుల వేణు, పోతుల సంజీవ్, ముచ్చ సమిరెడ్డి, కాశిరెడ్డి మహేందర్ రెడ్డి , మండల సాయిబాబా, కొలిపాక శ్రీనివాస్, గుడ్డేలుగుల సమ్మన్న, గంట సంపత్, విజయ్ కుమార్, యాల్ల సంజీవరెడ్డి, మునిగంటి నాగరాజు, బొరగల సారయ్య, అంకతి వాసు, వేముల హృతిక్ గౌడ్ , బొరగాల అజయ్, గూడూరు కొండాల్ రెడ్డి, యాళ్ళ రాజిరెడ్డి, రేపాక రాజు, భాస్కర్ యాదవ్, రాజేష్ కన్నా, కొడిమ్యాల పవన్ , మొలుగూరి రాజు, అఖిల్, తోకల లాలు ప్రసాద్, ఎండి బాబర్ ,తాడిపత్రి శ్రావణ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.




కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న బీజేపీ నాయకులు





