
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్(ఇల్లందకుంట) : ఇల్లందకుంట మండల కేంద్రంలోనీ గరుడ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల దిష్టి బొమ్మ దగ్దం చేయడం జరిగింది. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు జగ్గారెడ్డి బిజెపి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ కులము ప్రస్తావన తీసుకొచ్చారనీ, తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము మహేష్ కుమార్ గౌడ్ మీ కులగనలో ఈటల రాజేందర్ కులము నమోదు చేయలేదా, లేదా మీరు చేసిన కులగనన అంతా ఒక బూటకమా దీనికి సమాధానం చెప్పాలన్నారు. మీరు చేసిన కుల గణన సర్వేలో క్రిస్టియానిటీ మతం వారిని తక్కువగా చూపించడమే కాకుండా ముస్లింలను బీసీలలో కలిపి ఈ రాష్ట్రానికి సమాజానికి చాలా నష్టం చేశారనీ, అది సరిపోదు అనుకోని ఇప్పుడు ఏకంగా సీనియర్ నాయకులు ఒక పార్లమెంటు సభ్యుడిని పట్టుకొని నీ కులం ఏంటని అడిగి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా అన్నారు. తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకేనా ఒక్కసారి ఆలోచన చేయాలనీ, ఇక జగ్గారెడ్డి విషయానికి వస్తేనే ఎప్పుడు ఎవరిమీద పిచ్చి పట్టిన కుక్కలాగా అరుస్తాడో ఎవరికీ తెలవదనీ, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గాని రాష్ట్రంలో ఉన్న ఇతర నాయకుల పైన ఎప్పుడు ఏ విధంగా సంస్కారం లేని నాయకుడు అని చెప్పడానికి సిగ్గుపడే జగ్గారెడ్డి ఎలా ప్రవర్తన ఉంటుందో మాకంటే మీకే బాగా తెలుసు అన్నారు. కాబట్టి అలాంటి నాయకుల పార్టీ కాంగ్రెస్ పార్టీ వారి గురించి మాట్లాడితే ఈ ప్రజాస్వామ్య దేశంలో అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటేనే అసహ్యం వేస్తుందనీ ఆ భాష కానీ ఆ విధానం కాని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివారా రాజకీయ నాయకులు అని అనుమానం కలిగేటట్టుగా ఉందన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా విన్నపము ఇలాంటి సంస్కారం లేని మీ నాయకులను సస్పెండ్ చేస్తారా లేదా వారి నోటికి తాళం వేస్తారో ఆలోచించండి అని పేర్కొన్నారు. లేనియెడల తెలంగాణ సమాజమే మీ పైన కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడి మిమ్మల్ని భూస్థాపితం చేయక తప్పదు చేయక తప్పదన్నారు. ఈటల రాజేందర్ వ్యక్తిత్వము రాజకీయ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుందనీ , రాజకీయాలలో అజాతశత్రువుగా ఉంటూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ విమర్శకులను కూడా సద్విమర్శగా తీసుకొని రాజకీయాలు చేసే ఈటల రాజేందర్ పైనే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఈటెల రాజేందర్ గారి ప్రస్థానము ఎంతో విశిష్టము మరియు ప్రత్యేకము అని, ఉద్యమ సమయంలో ఉద్యమానికి కావలసిన ఆక్సిజన్‌ను అందించడమే కాకుండా కొవ్వొత్తిలా తను కరుగుతూ తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా సేవలందించారో మనకందరికీ విధితమే అన్నారు. కాబట్టి మిత్రులారా తెలంగాణ రాష్ట్రము ఆదర్శంగా ఉండాలంటే మన నాయకుల మాట తీరు నడక నడత ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్త శ్రీనివాస్, కంకణాల సురేందర్ రెడ్డి, గురుకుంట్ల సాంబయ్య, ఎండి షఫీ ఖాన్, శీలం శ్రీనివాస్, కందాల రాజేందర్, గుత్తికొండ రాంబాబు, మట్ట పవన్ రెడ్డి, బక్కతట్ల రాజయ్య, ఉప్పు దుర్గన్న, మట్ట బాల్ రెడ్డి, బండి రాజు, దురిశెట్టి ఓంకార్, చదువు సాయిరెడ్డి, కళాల సంజీవ్, తుపాకుల సతీష్, జోడు సంపత్, నూనె శివ, బక్కతట్ల రాకేష్, కమ్మగోని అజయ్, బీనవేని అనిల్, మట్ట సుధాకర్ రెడ్డి, తిప్పరబోయిన సమ్మయ్య, నర్రా మధుకర్ రెడ్డి, శ్రావణ్, మేకల మురళి, అశోక్, సంజీవ్, చంద్రమౌళి, రవి, స్వామిదాసు తదితరులు పాల్గొన్నారు.







