
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ రోజు హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో బాలబాలికలకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న వారందరికీ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామ సమీపంలో ఉన్న నాగార్జున డేయిరీ ఆధ్వర్యంలో ఎండి పుల్లూరి ప్రభాకర్ రావు, డైరెక్టర్ గణేష్ రావ్ ఆదేశానుసారం ఏజియం ఆకునూరి సుధాకర్ చేతులమీదుగా సుమారు 180 మంది పిల్లలకు అరటిపండ్లు, కోడిగుడ్డు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం సుధాకర్ మాట్లాడుతూ చిన్నారులు ఆటపాటలతో పాటు సమ్మర్ ఉచిత కోచింగ్ గ్యాపన సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించు కోవాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో చదువుకు ఉపయోగపడే మేధస్సు పెరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ నేతలు, అధ్యక్షుడు కే హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు మండల యాదగిరి, మాజీ వాకర్స్ నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, మతిన్, తదితర సభ్యులు, కరాటే మాస్టర్ బి బాబురావు, మున్సిపల్ సిబ్బంది ప్రతాప రాజు, రొంటాల సుధీర్, తూముల కుమార్, వినయ్, నరేష్, అనిల్, పాల్గొని నాగార్జున డేయిరి యాజమాన్యనీ కి కృతజ్ఞతలు తెలిపారు.







