
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని మోడీ సర్కార్ బీహార్ రాష్ట్రం దర్భంగాలో అంబేద్కర్ హాస్టల్లో దళిత విద్యార్థులను రాహుల్ గాంధీని కలవనీయకుండా కేంద్ర పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి FIR లు నమోదు చేసినందుకు నిరసనగా బిజెపి ప్రభుత్వ నియంత పరిపాలనను నిరసిస్తూ
హుజురాబాద్ మండలం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చల్లూరి విష్ణువర్ధన్ అధ్యక్షాతన పంజాల అరవింద్ యువజన అధ్యక్షులు ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌక్ లో నరేంద్ర మోడీ దిష్టి దహనం చేసారు. ఈ సందర్బంగా చల్లూరి విష్ణువర్ధన్ మరియు పంజాల అరవింద్ లు మాట్లాడుతూ… రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేని మోడీ సర్కార్రా హుల్ గాంధీ పర్యటనలను అడ్డుకోవడం సిగ్గు చేటు అన్నారు. బిజెపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన రాహుల్ గాంధీకి దేశ ప్రజల్లో ఉన్న ఆదరణను పోగొట్టలేవని స్పష్టం చేశారు.
త్వరలోనే మతతత్వ బిజెపి పార్టీకి దేశ ప్రజలు సరైన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ హుజురాబాద్ మండల అద్యక్షులు పంజాల అరవింద్, ఉపాధ్యక్షులు చల్లూరి విష్ణువర్ధన్, నాయకులు సందీప్, అరుణ్, అసెంబ్లీ కార్యదర్శి చిట్యాల రేవంత్, కార్యదర్శి పంజాల రాజు, మరియు , యువజన కాంగ్రెస్ నాయకులు త్రినేష్,
సాయి, బన్నీ, సాయి, రవితేజ, బన్నీ, రాజేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










