
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు సాధన సమితి సభ్యులను గురువారం అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత బంధు రెండవ విడత గ్రౌండింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు, అయినప్పటికీ ఈరోజు కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కరీంనగర్ కి వస్తున్నారని సాధన సమితి సభ్యులు ఎక్కడ వాళ్ళను అడ్డుకుంటారో అని భావించి ముందస్తు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ చేపించిందని దీనిని దళితబందు సాధన సమితి పూర్తిగా ఖండిస్తున్నామన్నాడు. హుజురాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో దళిత బంధు సాధన సమితి మండల ఇంచార్జి అకినపల్లి ఆకాష్, శనిగరం రవీందర్, శనిగరం రాజు, శనిగరం సమ్మయ్య, శనిగరం బుచ్చయ్య తదితరులు ఉన్నారు.

హుజురాబాద్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన దళిత బంధు సాధన సమితి నాయకులు..





