Oplus_131072
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్,మే30:
సబ్-జూనియర్ బాలికల విభాగానికి సంబంధించిన ఓపెన్ హాకీ సెలెక్షన్లు జూన్ 1వ తేదీ ఆదివారం ఉదయం 8:00 గంటలకు సికింద్రాబాద్లోని ఆర్.ఆర్.సి. రైల్వే గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ తిరునగరి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలెక్షన్లలో పాల్గొనదలచిన బాలికలు తప్పనిసరిగా తమ పేరును మే 31 సాయంత్రం లోపు ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ తో సంబంధిత జిల్లా హాకీ అసోసియేషన్ ఇన్చార్జి కార్యదర్శి మహమ్మద్ లియాకత్ అలీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. సెలెక్షన్లకు హాజరయ్యే బాలికలు గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డు లేదా సంబంధిత ఐడీ కార్డును వెంట తీసుకురావలసిందిగా వారు తెలిపారు.






