Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఆరోగ్య మహిళా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హుజురాబాద్ ఆర్డిఓ సిహెచ్ రమేష్ బాబు అన్నారు. మంగళవారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య మహిళా కార్యక్రమంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమ అనారోగ్యాన్ని బయటికి చెప్పుకోలేక వచ్చిన వ్యాధి గుర్తించలేక అనేక ఇబ్బందులు పడతారని వ్యాధి ముదిరిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే డబ్బులు ఖర్చు అవుతాయని అన్నారు. ప్రజలందరి సౌలభ్యం కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ… ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ గర్భాశయం ముఖ ద్వార క్యాన్సర్ పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. సూక్ష్మ పోషక లోపాలు రుతుస్రావ సమస్యలు మోనోపాజ్ నిర్వహణ మూత్రణాల ఇన్ఫెక్షన్లు కుటుంబ నియంత్రణ సమస్యలు లైంగిక వ్యాధుల పై పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. షుగర్ బిపి థైరాయిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ… ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద 40 వేల రూపాయల విలువగల పరీక్షలు ప్రతి మంగళవారం ఆస్పత్రిలో చేయడం జరుగుతుందని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ సనా జువేరియా, ఆసుపత్రి అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.






