
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వనమాసాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉప్పుల శ్రీధర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వనమాస కార్యక్రమాల్ని పురస్కరించుకొని మూడు మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….హార్టికల్చర్ ద్వారా పండ్ల మొక్కల పెంపకానికి ఎక్కువ మంది రైతులను గుర్తించి మొక్కలు అందజేయాలని అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఉపాధి హామీ పనుల పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ గ్రామీణ అభివృద్ధి అధికారి కృష్ణ
ప్లాంటేషన్ సూపర్వైజర్ సత్యనారాయణ, హుజురాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాల ఎంపీడీవోలు తూర్పాటి సునీత, యాదగిరి, కృష్ణ ప్రసాద్, మండల పంచాయతీ అధికారులు సాగి సతీష్ రావు, బషిరుద్దీన్, ప్రభాకర్,
పంచాయతీ కార్యదర్శులు, ఏపీవోలు, ఈసీలు, టిఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉప్పుల శ్రీధర్

హాజరైన పంచాయతీ కార్యదర్శులు, ఏపీవోలు, ఈసీలు, టిఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు





