
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ఆదివారం రోజున ఉచిత హెల్త్ చెకప్ ని, విజేత హాస్పిటల్ మరియు ఆదిత్య ఆప్టికల్స్ వారి సహకారంతో నిర్వహించామనీ, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకి పిల్లల వైద్య నిపుణుడైన గాదం రవివర్మ పిల్లలను పరీక్షించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సమస్యల ఆధారంగా పిల్లలకు ఉచిత మందులు అందించారు. అలాగే కంటి పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి బ్లడ్ గ్రూప్ తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లల నిపుణుడు మాట్లాడుతూ విద్యార్థులు బలమైన ఆహారం తీసుకోవాలని, పిల్లలకు సెల్ ఫోన్ ని దూరంగా ఉంచాలని, అలాగే చిన్న సమస్యలకు సైతం సొంత వైద్యం చేయకుండా, డాక్టర్ నీ, సంప్రదించాలని తెలియజేశారు. తదనంతరం ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు సరైన ఆహారం తీసుకుంటే ఎదుగుదల బాగుంటుంది అని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని, అలాంటప్పుడే విద్యార్థుల హాజరు శాతం కూడా ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని, అపాడే చక్కగా నేర్చుకుంటారని తెలియజేశారు. తదనంతరం ఇంతటి గొప్ప కార్యక్రమాన్నీ నిర్వహించిన డాక్టర్ రవివర్మ, అలాగే హాస్పిటల్ యాజమాన్యాన్ని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజేత హాస్పిటల్స్ నిర్వాహకుడు దేవేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది అనిల్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






చిన్నారులకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యుడు..డాక్టర్ రవివర్మ,





