
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జులై24: కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలను పట్టణ అధ్యక్షుడు కొలిపక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఇరుమళ్ళ రాణి సురేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, మాజీ కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, కే రమాదేవి రోశెందర్, గనిశెట్టి ఉమా మహేశ్వర్, నరేష్, కృష్ణ, ఇమ్రాన్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.





కేటీఆర్ జన్మదిన కేక్ కట్ చేసి తినిపిస్తున్న నాయకులు..





