
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వీణవంక మండల వాస్తవ్యులు జ్యోతిష్య బ్రహ్మ, పూజ్యులు, శ్రీ గూడ జగదీశ్వర్ శర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జన్మదిన వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, వారు మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాన్ని వాసవి అన్నపూర్ణ సేవా సమితి హుజురాబాద్ వారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, వాసవి అన్నపూర్ణ సేవా సమితి నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







