
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలంలోని సింగాపురం లో గల కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో మాజీ రాజ్యసభ సభ్యుడు, కళాశాల వ్యవస్థాపక చైర్మన్ ఒడితల రాజేశ్వరరావు 14వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్య అందుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలనే ఆశయంతో వోడితల రాజేశ్వరరావు గ్రామీణ ప్రాంతంలో విద్యాసంస్థలను స్థాపించారని కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రాజేశ్వరరావు 14వ వర్ధంతిని నిర్వహించారు. రాజేశ్వర చిత్రపటానికి పూలమాల అలంకరించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజేశ్వరరావు సేవలను సతీష్ కుమార్ వివరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ ఒక మనిషి వ్యక్తిత్వాన్ని పెంచాలంటే కేవలము చదువు మాత్రమే చేయగలదని బాగా విశ్వసించారనే అన్నారు. విద్యకు దూరముగా ఉన్న నిరుపేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులను చేరాదీసి ఉత్తమ విద్యను అందించాలనే మహా ఉన్నతమైన ఆశయాలతో రాజేశ్వరరావు ఉండేవారని శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల రిజిస్ట్రార్ మరియు హ్యుమానిటీస్ అండ్ సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ వి రాజేశ్వరరావు, మెకానికల్ ఇంజనీరింగ్ అధిపతి డీన్ డాక్టర్ ఎం వి సతీష్ కుమార్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె రవీంద్రబాబు, ఏఐఎంఎల్ అధిపతి డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ రావు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధిపతి డాక్టర్ యోగేష్ పుండలిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి రమేష్, సివిల్ ఇంజనీరింగ్ అధిపతి డాక్టర్ అనిల్, డీన్ అకాడమిక్ డాక్టర్ జి మల్లయ్య, ,వివిధ విభాగాల అధిపతులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్. ఎన్ శశికళ అక్కడ అకాడమిక్ కోఆర్డినేటర్ అక్కడ మీకు కోఆర్డినేటర్ డాక్టర్ కే మధులత, లైబ్రేరియన్ ఈ రామకృష్ణారావు ,అధ్యాపకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ వీరు నాయక్ డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ కొమురయ్య తదితరులతో పాటు సిబ్బంది పి విజయేందర్, ఐ రమేష్ కుమార్ , ఏ అశోక్, శ్రీకాంత్, రమణరావు, రవీందర్, విద్యార్థులు, పాల్గొన్నారు.



రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కిట్స్ సేక్రటరీ అండ్ కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్..





