Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం హుజూరాబాద్ తహసిల్దార్ కే కనుకయ్యకు ఐక్య ఉపాధ్యాయ పోరాట సమితి నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..విద్యా, ఉపాధ్యాయ రంగంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వ ఉత్తర్వులు 25ను సవరించాలని, 60 మంది విద్యార్థులు దాటితేనే ముగ్గురు ఉపాధ్యాయులు అన్న నిబంధనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు వెంటనే నిర్వహించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, రిటైర్ అయిన ఉపాధ్యాయుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న డిఏ లను సత్వరమే విడుదల చేయాలని పిఆర్సి రిపోర్టు తెప్పించుకొని అమలు చేయాలని జీవో నెంబర్ 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు స్థానికత ఇవ్వాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో USPC బాగాస్వామ్య సంఘాల నాయకులు డిటి ఎఫ్ అపెక్స్ కమిటీ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్ చక్రధర్, మండల ప్రధాన కార్యదర్శి బి తిరుపతిరెడ్డి, చంద్రగిరి మల్లేశం, అల్లి శ్రీనివాస్, కే వెంకటస్వామి, వేల్పుల రత్నం, వీరన్న నాయక్, జె. విక్రమ్, సదానందం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






