
– హుజురాబాద్ బస్ స్టాండ్ సందర్శన, సమస్యలు పరిష్కరిస్థాం.
– ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం.
– బండి ట్రాప్ లో ఈటల, ఈటెల ట్రాప్ లో బండి కాదు,బీజేపీ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడుతున్నాడు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి మహిళలకు ఆర్థికంగా చేయూత నిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున హుజురాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బస్ స్టాండ్ లో ఉన్న పలు సమస్యలు ప్రణవ్ దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి, పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలకు ఉచిత టికెట్ లను ఇచ్చామని, 6,800 కోట్ల ప్రయాణ చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని, ఇదొక చరిత్ర అని అన్నారు. హుజురాబాద్ డిపో పరిధిలో దాదాపు 1,34,02,821మందికి సుమారు 53 కోట్లు ప్రయాణ ఛార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో చేసి చూపెట్టింది అన్నారు.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, విమర్శించనవారే కితాబు ఇస్తున్నారని అన్నారు. మహిళలను ఆర్థికంగా చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మహిళా సంఘాలకు బస్ నడుపుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం నుండి కల్పించామని అన్నారు. విజయవంతంగా పథకాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
దళిత బంధు ఆపింది కౌశిక్ రెడ్డి..
దళిత బంధు విషయంలో కౌశిక్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని, ఉప ఎన్నికల సమయంలో ప్రారంభమైన దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో అందరికి ఇవ్వకుండా కౌశిక్ రెడ్డి కుట్రలు చేశారని అన్నారు. ప్రభుత్వ విప్ గా, ఎమ్మెల్సీగా ఉండి ఆనాడు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని అన్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం వారిని వాడుకున్నారే తhప్ప వారి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోపే దళిత సంఘాల నాయకులకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్యపై పలు దఫాలు చర్చించగా గత జనవరిలో ఫ్రీజింగ్ ఎత్తివేశామని, ప్రభుత్వంలో ఉండి చేయలేక ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తుంటే కౌశిక్ రెడ్డి ఓర్వలేక పోతున్నాడని, దళితులు ఎవరు అధైర్యపడిద్దని, ఆలస్యమైన అర్హులైన ప్రతి లబ్దిదారునికి దళిత బంధు నిధులు అందజేస్తామని, దళారులను నమ్మి మోస పోవద్దని అని అన్నారు.
ఇల్లిస్తాం, ప్రభుత్వ పథకాలను అందరికీ అందజేసేలా కృషి చేస్తా.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మింగుడు పడడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇళ్ళు అయినా హుజురాబాద్ పేద ప్రజలకు ఇచ్చాడా అని ప్రశ్నించారు?కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పంచలేదని,ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో 3500 ఇళ్లను మొదటి విడతగా అందజేశామని, బేస్మెంట్ వరకు పూర్తైన ఇళ్లకు డబ్బులు కూడా పడ్డాయని, మొదటి కౌశిక్ రెడ్డి కళ్ళు పెద్దగా చేసి చూస్తే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కనిపిస్తాయని అన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు, కోట్ల రూపాయల ఆరోగ్య శ్రీ,రైతు భరోసా, రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.
బీజేపీ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి,స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం..
బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న అంతర్గత పార్టీ విషయాల్లో కౌశిక్ రెడ్డి దూరడం చూస్తే బీజేపీ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడుతున్నాడని అందుకే బండి సంజయ్ కు మద్దతుగా మాట్లాడుతున్నాడని ప్రణవ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే అని ఎలక్షన్ నుండి చెప్తున్న అని ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడడం చూస్తుంటే నిజమని తెలుస్తుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 మండలాల్లో, 2 పట్టణాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అన్నారు. హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందనీ ధీమా వ్యక్తం చేశారు.



బస్టాండులో మహిళలను ఉచిత ప్రయాణంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్న ప్రణవ్..

డిపో మేనేజర్ తో కలిసి గృహలక్ష్మి పథకం విజయవంతం పై సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రణవ్….

. గృహలక్ష్మి పథకం విజయవంతం పై మాట్లాడుతున్న ప్రణవ్…






