
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్ట్ 8: గంజాయి వద్దు.. ఆరోగ్యం ముద్దు ! అంటూ హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ శుక్రవారం పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు అనే బోర్డును తన మెడలో వేసుకుని సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఎస్సార్ ఆసుపత్రి ఏరియా, భరత్ పంప్ ఏరియా, సిరసపల్లి క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు గ్రహీత నలుబాల వేణుగోపాల్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి ఇతర నిషేధిత మత్తు పదార్థాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని కోరారు. డ్రగ్స్, గంజాయి ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా సమూలంగా అరికట్టాలన్నారు. డ్రగ్స్, నిషేధిత మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అందుకు అనుగుణంగా ఇటీవల ఉక్కు పాదం మోపుతోందని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికోలు గంజాయి మత్తులో తూలుతూ గంజాయినీ సేవించడం ఎంతో బాధాకరమన్నారు. ఎక్కువగా వీటికి యువతనే ఆకర్షితులవుతున్నారని, వాటిని సేవించి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా గంజాయి వినియోగం ఇటీవల పెరుగుతున్నట్లు మీడియా ద్వారా తెలుస్తుందని ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని వేణుగోపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ సందర్భంగా నలువాల వేణుగోపాల్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి రమేష్, మడుగు రమేష్, కారంకంటి రవీందర్, ఆదిమూలము అజయ్, కొల్లూరి ఆనంద్, పరకాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.




పలుచోట్ల పలువురికి డ్రగ్స్, గంజాయి సేవించడం వల్ల ఏర్పడే అనర్థాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్న సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్..
—————++++++++——————–
@@పత్రికా ప్రకటనలు&&
——————++++++—————————
&&వార్షికోత్సవ శుభాకాంక్షలు##






