
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ క్లబ్ లో గౌరవ అధ్యక్షుడు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీను ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఫోటోగ్రఫీ అని అన్నాడు. ప్రతి ఒక ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు టి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి మధుకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాచర్ల రాజు, ఉపాధ్యక్షులు యాకుబ్ ఆలీ, కుమార్, సీనియర్ సభ్యులు రాజేందర్, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు రాజేష్, మురళి, కమిటీ సభ్యులు రమేష్, రసూల్, అంజద్ ఖాన్, శ్రీధర్, శ్రీశైలం, రాజేష్, రాజుతో పాటు మండల ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.


గౌరవ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ కేక్ కట్ చేయగా ఆయనకు కేక్ తీనిపిస్తున్న అధ్యక్షుడు ప్రసాద్…

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న హుజురాబాద్ పట్టణ, మండల ఫోటోగ్రాఫర్లు..
————-+++++++++—————–
##పత్రిక ప్రకటనలు##
—————++++++———————-
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు&&






