
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే పురస్కరించుకొని బుధవారం మండల అధ్యక్షుడు తలకొక్కుల హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యమానికి రాష్ట్ర అసోసియేషన్ ప్రధానకార్యదర్శి సిరి రవి, సౌత్ ఇండియా ప్రతినిధి రాజేష్ రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ ముఖ్య సలహాదారులు కేదార్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాచర్ల రాజు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ బలంగా ఉండాలంటే మండల అసోసియేషన్ లు పట్టుకొమ్మాలని, మండలం అసోసియేషన్ బలంగా ఉంటేనే రాష్ట్ర అసోసియేషన్ బలంగా ఉంటుందన్నారు కుటుంబ ఆర్థిక భరోసా లో భాగంగా రాష్ట్ర అసోసియేషన్ కుటుంబ భరోసా స్కీమ్ తీసుకువస్తే హుజురాబాద్ మండలం సభ్యులందరు చేరి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారని కొనియాడారు. ఒక ఫోటో గ్రాఫర్ ఎప్పుడు నిత్య విద్యార్థి అని ఈ డిజిటల్ యుగంలో ఫోటో గ్రాఫర్ నిత్యం మెలుకువలు నేర్చుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తలకొక్కుల హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి మధుకర్, గౌరవ అధ్యక్షులు డి రాజేందర్, జిల్లా సభ్యులు రాజేష్, మురళి మోహన్, ఉపాధ్యక్షులు యాకుబ్ కుమార్, సభ్యులు రాజేష్, రాజు, శ్రీశైలం, వెంకటయ్య, ప్రసాద్ సభ్యులందరు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఆ సంఘం అధ్యక్షుడు ప్రసాద్..

ఆ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ ను పూలబోకే ఇచ్చి టవల్ కప్పి సత్కరిస్తున్న అతిథులు






