Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గణపతి నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని హుజురాబాద్ గణపతి నిమజ్జన ఉత్సవ సమితి కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ప్రతీ సంవత్సరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన ఉత్సవ సమితి గణపతి నవరాత్రుల సందర్బంగా పట్టణములో ఏర్పాటు చేసిన మంటపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సంబంధిత పురపాలక సంఘం, రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో అనుసంధానంగా ఉంటూ గణపతి నిమజ్జన ఉత్సవాలలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఉత్సవ సమితి వారధిగా నిలుస్తుంది. నిమజ్జనం రోజున స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిమజ్జన ఆహ్వాన వేదిక ఏర్పాటు చేసి నగర అధికారులను మరియు పెద్దలను ఆహ్వానించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ నిమజ్జనానికి తరలి వచ్చే గణపతి రథములను, మంటప నిర్వాహకులను వేదిక పైకి ఆహ్వానించి సత్కరించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా గణపతి నిమజ్జన ఉత్సవ సమితి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చెయ్యడం జరిగినది. గౌరవ అధ్యక్షులుగా గంధే శ్రీనివాస్, అధ్యక్షులుగా
బుర్ర నటరాజ్, ఉపాధ్యక్షులు కెడీ రాజు, ములుగు పూర్ణ చందర్,
నల్లగొని రాకేష్, ప్రధాన కార్యదర్శిగా సురేష్, కోశాధికారిగా
వంగల రాహుల్, సహాయ కార్యదర్శులుగా కొమురవేల్లి సంతోష్,
సదానందం, అయిత సందీప్, కొండ్ర మహేష్ లను ప్రకటించారు.






