
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను గురువారం జిల్లా సిపి గౌస్ ఆలం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు నిమజ్జనం చేసే వినాయక మండపాల బాధ్యులకు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు కలగకుండా చూసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. అలాగే గతంలో కన్నా నిమజ్జనం వద్ద పలు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని జోరుగా లైట్లు ఇతర ఏర్పాట్లు చేసిన బల్దియ కమిషనర్ కే సమ్మయ్యను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఇన్చార్జి ఏసిపి శ్రీనివాస్ జి, హుజురాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, జమ్మికుంట టౌన్ సిఐ రామకృష్ణ, జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ కేముసారపు సమ్మయ్య, ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ జరీనా, ఇరిగేషన్ AE కీర్తి తదితరులు పాల్గొన్నారు.



ఏర్పాటను పరిశీలిస్తున్న సిపి గౌస్ ఆలం.. వివరిస్తున్న కమిషనర్ సమ్మయ్య…

ఏర్పాట్లను ప్రత్యేకంగా అభినందిస్తున్న సిపి గౌస్ ఆలం…






