Oplus_16908288
— కౌశిక్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నాడు
—బీజేపీ, బీఆర్ఎస్ ములాఖాత్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
—కౌశిక్ రెడ్డి అసత్య ఆరోపణలపై తీవ్రంగా మండిపడిన ప్రణవ్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీఆర్ఎస్ ది స్కాంల ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ ది ప్రజా ప్రభుత్వం.. బిజెపి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అంతర్గతంగా ఒప్పందం ఉందని ఇది సాక్షాత్తూ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత బహిరంగంగా చెప్పిందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని, కవిత లిక్కర్ స్కాం కేసులో బిజెపి ఎంపీ సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లి బిఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేయడానికి సుముఖంగా ఉన్నట్లు చెప్పారని మీడియా సాక్ష్యంగా తెలిపారని, దానికి ఇంత వరకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. ఎదుటి వారి గురించి మాట్లాడే ముందు తమ గురించి ఆలోచించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్కాంలు, అవినీతి చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంతో పేదలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
వసూళ్లకు పాల్పడే చరిత్ర కౌశిక్ రెడ్డిది-ప్రణవ్
వసూళ్లకు పాల్పడే చరిత్ర ఎవరిదో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసునని, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్పూర్ మహేందర్, మహిపాల్ రెడ్డి దగ్గర ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసింది అందరికి తెలుసని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ మండిపడ్డారు. ఆరోపణలు చేయడం దాన్నుంచి తప్పించుకోవడం కౌశిక్ రెడ్డికి బాగా తెలుసునని, హుజురాబాద్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.
హుజూరాబాద్ లో యూరియా కొరత లేకుండా చూస్తున్నాం.
యూరియా కొరత నియోజకవ్యాప్తంగా లేకుండా చూస్తున్నామని, రైతులెవరూ అధైర్యపడవద్దని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన సమీక్ష సమావేశంలో యూరియా పై నివేదికలు అందజేశామని, యూరియా సరఫరా కేంద్రం నుండి రావాలని ఆది బీజేపీ ఎంపీలే చెప్పారని ఆది కూడా తెలియకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఇది కౌశిక్ రెడ్డి రాజకీయ అవివేకతనానికి నిదర్శనమని అన్నారు. అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి యూరియా కొరత తగ్గించే విధంగా చూస్తున్నామని అన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్..





