Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కు చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 1987-88 SSC హైస్కూల్ లో చదువుకున్న మిత్రుడు చనుమల్ల ప్రసాద్ గత 12 సంవత్సరాలనుండి మూత్ర నాళల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ప్రసాద్ ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి ఎదులాపురం మిత్ర సేవ సమితి (1987-88 SSC బ్యాచ్ ) GOVT HIGH SCHOOL హుజురాబాద్ పూర్వ విద్యార్థులు కలిసి ప్రసాద్ కు వైద్య ఖర్చుల కింద 35,500/-రూపాయలను నగదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. గతములో కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. తోచిన విధంగా సహాయాన్ని అందించిన మిత్రులకు ప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. సేవ సమితి అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి గంగిశెట్టి రవీందర్, కోశాధికారి జెల్ల రాంబాబు, మాజీ కౌన్సిలర్ పాల కిషన్, ప్రసాద్, ప్రతాప సతీష్, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.






