
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): సైదాపూర్ మండలంలోని సంతోషిమాత మండల సమాఖ్య పరిధిలోని 35 గ్రామ సంఘాలకు పొన్నం సత్తయ్య గౌడ్ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిసి సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి కీ శే పొన్నం సత్తయ్య జ్ఞాపకార్థం మంత్రి తల్లి పొన్నం మల్లమ్మ, సతీమణి మంజుల చేతుల మీదుగా స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. స్థానిక సొసైటీ ఫంక్షన్ హాల్ లో శనివారం గ్రామైక్య సంఘాల మహిళలకు స్టీలు బ్యాంకు వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంత సుధాకర్, డిపిఎం సతీష్, ఏపీఎం చెన్నవేని తిరుపతి, మంత్రి పిఎ వెన్నం మల్లేశం,
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ న్యాడండ్ల రాజ్ కుమార్, ఏఏంసి డైరెక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, ఉసకోయిల ధనలక్ష్మి రాఘవులు, కొమురయ్య, యూత్ నాయకులు సాయి, అనిల్, మండల సమాఖ్య ప్రతినిధులు సంధ్యారాణి, కావ్య, సెర్ప్ సిసి లు దేవేందర్, అనపురం రమేశ్, తిరుపతి, పర్షరాములు, రమేశ్, శ్రీకాంత్, పద్మ, సిఓ కిషోర్, అకౌంటెంట్ గీత, అటెండర్ వెంకటేష్, విఓఏ ల ప్రతినిధులు, విఓఏలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.



మహిళా గ్రామైక్య సంఘాలకు స్టీలు బ్యాంకు వితరణ చేస్తున్న మంత్రి తల్లి పొన్నం మల్లమ్మ, సతీమణి మంజుల..





