Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబరు 16: ఈనెల 18వ తేదీన జరగబోయే రాష్ట్ర బంద్‌కు బీసీ వర్గాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీసీ కుల జనగణన మండల కన్వీనర్ మార్త రవీందర్ గురువారం పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వంగానీ, ప్రతిపక్ష పార్టీలుగానీ చిత్తశుద్ధి చూపడం లేదని ఆయన విమర్శించారు. ప్రజా వర్గాల మధ్య నమ్మకం కోల్పోయేలా రాజకీయ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. బీసీల జనాభా తెలంగాణాలో 56.5 శాతం ఉందనీ, అలాంటి పెద్ద వర్గానికి 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్నారు. పైగా, తమ పార్టీ ప్రయోజనాల కోసమే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారన్నారు. ఇది బీసీలకు న్యాయం కాదని ప్రజలు గుర్తించాలని అన్నారు. రేపు జరగబోయే బంద్‌లో బీసీ వర్గాలు, సబ్బండ వర్గాలు, ప్రజాసంఘాలు అందరూ ఐక్యంగా పాల్గొని, బీసీల హక్కుల కోసం ఒక్కటిగా నిలవాలని రవీందర్ పిలుపునిచ్చారు.






