
– జడ పత్తాలేని రాజీవ్ యువ వికాసం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కుతూ యావత్ ప్రజానీకాన్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు దిశగా చర్యలు చేపట్టాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని డిమాండ్ చేశారు. గురువారం అయిన విలేకరులతో మాట్లాడుతూ.. యువతకు రాజీవ్ యువ వికాసం పథకం 2025 దరఖాస్తు ఏప్రిల్ 14, ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను ఇస్తానని చెప్పి మోసం చేసి నేటి వరకు కూడా రాజీవ్ యువ వికాసం ఊసే ఎత్తడం లేదన్నారు. యువతను ఓట్ల కోసం తప్ప వాళ్ల బాగోగుల కోసం, ఉపాధి కోసం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ అవకాశాల కోసం చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు చేసిన మేలు ఏమీ లేదని అన్నారు. రాజీవ్ యువ వికాసం పేరుతో దరఖాస్తుదారులకు అదనపు పెను భారం మోపారు తప్ప ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు అన్నారు. చెప్పడం కొండంత చేయడం మాత్రం ఏమీ లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు రుణాలు మంజూరు చేస్తానని చెప్పి చేయకపోవడం పట్ల యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వెంటనే దరఖాస్తు చేసుకున్న అర్హులైనటువంటి యువతకు రుణాలు మంజూరు చేయాలని, లేని పక్షంలో యువత ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హరీష్ వర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి విలేకరులకు వివరిస్తున్న టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని..





