
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో గల గెలాక్సీ సూపర్ మార్కెట్ లక్కీ డ్రా విజేతలను శుక్రవారం ముఖ్య అతిథుల చేతుల మీదుగా లక్కీ డ్రాను తీశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 31 వరకు లక్కీ డ్రాను నిర్వహించారు. సూపర్ మార్కెట్లో 1999 రూపాయల విలువచేసే వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఉచిత కూపన్ అందజేశారు. ఇందులో మొదటి బహుమతిగా వాషింగ్ మిషన్ (సుమారు రూ. 20,000) విలువగలది, రెండవ బహుమతి డిన్నర్ సెట్ (సుమారు రూ. .3,000) విలువగలది, మూడవ బహుమతి వాటర్ కూల్ క్యాన్ (2,000) విలువగలది బహుమతులుగా నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో సుమారు 800 మంది వినియోగదారులు గెలాక్సీ సూపర్ మార్కెట్లో లక్కీ డ్రాకు అర్హత సాధించగా శుక్రవారం ముఖ్య అతిథులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) మహమ్మద్ యూనస్ అహ్మద్ ఖాన్, మజీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, చేల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ అతిథులుగా లక్కీ డ్రాను తీశారు. ఇందులో మొదటి బహుమతినీ ఎస్ స్వాతి చింతలపల్లి అనే కస్టమర్ మొదటి బంపర్ ప్రైజ్ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకున్నారు. రెండవ ప్రైజ్ ను హుజురాబాద్ పట్టణానికి చెందిన సుజాత గెలుపొందగా, మూడో ప్రైజ్ ను మండలంలోని సిరపల్లి కి చెందిన వామిక గెలుపొందారు. విజేతలకు సెల్ ద్వారా సమాచారం ఇచ్చి రప్పించి అతిధుల చేతిలో మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అందిస్తున్న గెలాక్సీ సూపర్ మార్కెట్ ని ఆదరించండి.. నాణ్యమైన సరుకులను సొంతం చేసుకోండి అంటూ సూచించారు. అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందుతున్న గెలాక్సీ సూపర్ మార్కెట్ సేవలను పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అతిథులు సూచించారు. పి లక్కీ డ్రా కార్యక్రమంలో గెలాక్సీ సూపర్ మార్కెట్ యాజమానీ షేక్ అబ్దుల్ మతిన్ తో పాటు రంగాపూర్ మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్, దేవి సిల్క్స్ యజమాని విజయ్ కుమార్, షేక్ నదీమ్, షేక్ నయీమ్, షేక్ నవాజ్, షేక్ అబ్దుల్ మన్నన్, ఎండి మషూక్, హఫీజ్, ఇమ్రాన్, ఫయాజ్, ఎండి అప్సర్, మతిన్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సై యునస్ ఖాన్ ను సన్మానిస్తున్న గెలాక్సీ నిర్వాహకులు..

మజీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ను సత్కరిస్తున్న గెలాక్సీ సూపర్ మార్కెట్ నిర్వాహకులు..

అతిథులు మాజీ సర్పంచులు నేరెళ్ల మహేందర్ గౌడ్, బింగి కరుణాకర్లను సత్కరిస్తున్న నిర్వాహకులు..


లక్కీ డ్రా తీస్తున్న అతిథులు..



బంపర్ ప్రైస్ మొదటి బహుమతి వాషింగ్ మిషన్ సాధించినమొదటి బహుమతినీ ఎస్ స్వాతి చింతలపల్లి అనే





